Header Banner

అనంతపురంలో భారీగా తిరంగా ర్యాలీ.. భారత్ సైన్యానికి మద్దతుగా భారీ స్థాయిలో పాల్గొన్న ప్రజలు!

  Sat May 17, 2025 12:15        Politics

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా.. జాతీయ జెండా చేత పట్టుకుని నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్.. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, పల్లె సింధూర, బండారు శ్రావణి ఇతర ప్రజా ప్రతినిధులు సహ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నుండి సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి మన త్రివిధ దళాల సత్తా చాటామన్నారు. ఉగ్రవాదం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకునే కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని ఏమీ చేయలేవన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశ సైన్యం శక్తి ఏంటన్నది యావత్ దేశానికి తెలిసిందన్నారు.

 

ఇది కూడా చదవండి: ఈ ఎండాకాలంలో మందు బాబులకు కూల్ కూల్ న్యూస్.. భారీగా తగ్గిన బీర్ ధరలు!

 

పెహల్గాంలో అమాయక పర్యాటకుల ప్రాణాలు తీస్తే.. మన సైనికులు కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేశారన్నారు. గుంటూరులో ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ర్యాలీకి భారీగా హాజరైన ప్రజలు.. జాతీయ జెండాలతో నగరవీధులలో ర్యాలీ నిర్వహించారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను అంతం చేశామనన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైన్యానికి హాట్సాఫ్ అని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగాన్ని దేశ ప్రజలు మర్చిపోరన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణే మొదటి ప్రాధాన్యం అని పెమ్మసాని చెప్పుకొచ్చారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting